News March 18, 2025

IPL మ్యాచ్: HYDలో భారీ బందోబస్తు

image

IPL అభిమానులకు అసౌకర్యం కలగకుండా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో IPL నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ క్రికెట్ ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్‌ పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఉంటుంది.

Similar News

News March 19, 2025

యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్‌హౌస్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

News March 19, 2025

NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News March 19, 2025

TODAY HEADLINES

image

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TG: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత: సీఎం రేవంత్
AP: చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: CM
AP: 50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన
☛ కుంభమేళా దేశ ప్రజల విజయం: PM మోదీ
☛ మే 20న దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు
☛ ISS నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం

error: Content is protected !!