News October 31, 2024

IPL: విశాఖ ప్లేయర్‌కు రూ.6కోట్లు

image

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.

Similar News

News October 30, 2025

‘83 పునరావాస కేంద్రాల్లో 1516 మందికి ఆశ్రయం’

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 83 పునరాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1,516 మంది ఆశ్రయం పొందారు. ములగాడ మండలంలో 7 పునరావాస కేంద్రాల్లో 782 మంది ఆశ్రయం పొందారు. మహారాణిపేటలో 7 పునరావాస కేంద్రాల్లో అత్యధికంగా 520 మంది ఆశ్రయం పొందారు. సీతమ్మధార మండలంలోని 7 పునరావస కేంద్రాల్లో 82 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

News October 30, 2025

తుపాన్ ప్రభావంతో జిల్లాలో 22 ఇళ్లకు నష్టం

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 22 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆనందపురం మండలంలో 8, పద్మనాభం మండలంలో 6, భీమిలి మండలంలో 3, గోపాలపట్నం మండలంలో 2, పెదగంట్యాడ మహారాణిపేట విశాఖ రూరల్‌లో ఒక్కొక్క ఇల్లు దెబ్బతిన్నట్లు నివేదికలో తెలిపారు. వీటిలో పూర్తిగా దెబ్బతిన్నవి 2 ఉన్నట్లు చెప్పారు.

News October 29, 2025

రేపు విశాఖపట్నంలో పాఠశాలలకు సెలవు

image

తుపాన్ కారణంగా విశాఖపట్నం జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ, ఈదురు గాలులతో వర్షం భారీగా పడే అవకాశం ఉందని.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.