News October 31, 2024

IPL: విశాఖ ప్లేయర్‌కు రూ.6కోట్లు

image

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.

Similar News

News November 3, 2024

VZM: ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ కీలక సూచనలు

image

స్థానిక సంస్థ‌ల MLC స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌టంతో, జిల్లాలో శ‌నివారం నుంచి ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటించాల‌ని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు.

News November 3, 2024

పార్వతీపురం: సోమవారం గ్రీవెన్స్ రద్దు

image

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం లేదని దీన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. దూరప్రాంతాల నుంచి అనవసరంగా వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News November 3, 2024

పార్వతీపురం: జిల్లాలో నైపుణ్య గణన పక్కాగా చేపట్టాలి

image

జిల్లాలో నైపుణ్య గణన 2024ను పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య గణన 2024పై ఎంపిడిఓలతో కలెక్టర్ సమీక్షించారు.  కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 15 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సుగల వారి పూర్తి వివరాలను నైపుణ్య గణనలో నమోదుచేయించాలని అన్నారు.