News November 24, 2024

IPL వేలంలో మన విజయనగరం కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మన జిల్లా వాసిగా యశ్వంత్ ఐపీఎల్‌కు ఎంపిక కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

Similar News

News December 14, 2024

‘పోలీస్ బోర్డు’తో దర్జాగా గంజాయి రవాణా

image

గంజాయి అక్రమ రవాణాకు నిందితులు తమ వాహనాలకు ఏకంగా ‘పోలీస్ బోర్డు’ను తగిలించుకుని తరలించడం విస్మయం కలిగిస్తోంది. గురువారం రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 810 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిందితులు తెలివిగా పోలీసులు, చెక్ పోస్టుల నుంచి తప్పించుకోవడానికి తమ వాహనాలకు ఏకంగా పోలీస్ బోర్డు, ఫేక్ నెంబర్ ప్లేట్‌లు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

News December 13, 2024

భోగాపురం: చిట్టీల కేసులో భార్య, భర్త అరెస్ట్

image

చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

News December 13, 2024

మక్కువ: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

image

మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.