News November 26, 2024

IPL వేలంలో విజయనగరం కుర్రాడికి చుక్కెదురు

image

ఐపీఎల్ మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అయితే వేలంలో అతనికి చుక్కెదురయ్యింది. ఏ ఫ్రాంఛైజీ తనను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో విజయనగరం వాసులు, అభిమానులు నిరాశ చెందారు.

Similar News

News December 7, 2025

VZM: కలెక్టర్ ఆఫీస్‌లో రేపు పీజీఆర్ఎస్

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు అన్నారు.

News December 7, 2025

55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

image

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.

News December 6, 2025

విజయనగరం: పెన్షన్ దారులకు అలర్ట్.!

image

జిల్లాలో కుటుంబ పెన్షన్ దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగ మహేశ్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఖజానా కార్యాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించవచ్చని తెలిపారు.