News November 24, 2024
IPL వేలానికి మన కదిరి యువకుడు..!
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందిన క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. రూ.30 లక్షల బెస్ ప్రైస్ తో అతడు తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. నేడు, రేపు దుబాయ్ వేదికగా ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. గిరినాథ్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది.
Similar News
News December 12, 2024
వీర జవాన్ కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి పరామర్శ
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) భౌతికకాయానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళి అర్పించారు. భౌతికకాయాన్ని అధికారులు నిన్న రాత్రి నార్పలకు తీసుకురాగా ఆమె సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
News December 12, 2024
అక్రమ మద్యం వ్యాపారికి మూడేళ్లు జైలు శిక్ష
గోరంట్ల మండలం ముద్దులకుంట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి 2021లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీఐ జయనాయక్ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు సుదీర్ఘ విచారణ చేసి నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు.
News December 11, 2024
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047పై సమీక్ష
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047పై శ్రీ సత్యసాయి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అవిస్కరిస్తున్న సందర్భంగా అందుకు సంబంధించిన సన్నద్ధతపై బుధవారం రాత్రి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.