News April 25, 2024

IPL: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్

image

రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా SRH VS RCB ఐపీఎల్‌ మ్యాచ్ జరగనుంది. ఫ్యాన్స్ కోసం మెట్రో, TSRTC అధికారులు‌ అదనపు సర్వీసులు నడుపుతున్నారు. రేపు అర్ధరాత్రి 12:15 వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. మెహదీపట్నం, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, JBS, పాతబస్తీ తదితర ఏరియాల నుంచి స్టేడియానికి మొత్తం 24 రూట్‌లలో RTC సర్వీసులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోండి. SHARE IT

Similar News

News December 12, 2025

తొలి విడతలో RRలో 88.67% పోలింగ్ నమోదు

image

జిల్లాలోని 7 మండలాల్లో గురువారం తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉ. 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్, రాత్రి వరకు తుది ఫలితాలు వెల్లడించారు. ఎన్నికలు ముగిసే సమయానికి 88.67% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కొత్తూరు మండలంలో 91.27% నమోదు కాగా అత్యల్పంగా 86.85% శంషాబాద్‌లో నమోదైంది.

News December 11, 2025

షాద్‌నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

image

షాద్‌నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

News December 11, 2025

రంగారెడ్డిలో BRS vs కాంగ్రెస్

image

రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో నందిగామ, జిల్లేడ్ చౌదరిగూడం, కొత్తూరు మండలాలు బోణి కొట్టాయి. నందిగామ (M) బుగ్గోనితండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన బుగ్గసాలయ్య, జిల్లేడ్‌(M) ముష్టిపల్లి సర్పంచ్‌గా BRS బలపరిచిన జంగయ్య గెలుపొందారు. దీంతో BRS, కాంగ్రెస్ మధ్య ఫైట్ టఫ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తూరు (M) మల్లాపూర్ తండా సర్పంచ్‌గా ఇండిపెండెంట్‌ మీనాక్షి దశరథ్ గెలుపొందారు.