News November 27, 2024

IPL: అప్పుడు ₹.కోట్లు, ఇప్పుడు..

image

గత IPL వేలంలో కళ్లుచెదిరే ధర పలికిన క్రికెటర్లు ఈసారి అమ్ముడుపోలేదు. మరికొందరికి తక్కువ ధర వచ్చింది.
*మిచెల్‌కు 2024 మినీ వేలంలో రూ.14 కోట్లు, అల్జరీ జోసెఫ్‌కు రూ.11.50 కోట్లు, రూసోకు రూ.8 కోట్లు, పృథ్వీ షాకు రూ.7.50 కోట్లు రాగా ఈసారి అమ్ముడుపోలేదు. సమీర్ రిజ్వీ రూ.8.40 కోట్ల నుంచి రూ.95 లక్షలకు, కరన్ రూ.18.5 కోట్ల నుంచి రూ.2.40 కోట్లకు, స్టార్క్ రూ.24.75 కోట్ల నుంచి రూ.11.75 కోట్లకు పడిపోయారు.

Similar News

News December 6, 2025

40 ఏళ్లు వచ్చాయా? ఈ అలవాట్లు మానేస్తే బెటర్

image

40 ఏళ్లు దాటిన తర్వాత ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి సరిపడవు. చిప్స్, కేక్స్, కుకీస్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఒత్తిడితో కార్టిసాల్‌ విడుదలై హై బీపీ, షుగర్, మెమొరీ లాస్‌కు కారణమవుతుంది. స్క్రీన్ ఎక్కువ చూస్తే గుండె జబ్బులు, మధుమేహ సమస్యల ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా బ్లడ్, థైరాయిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 6, 2025

‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

image

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ సాధించారు. ఐపీఎల్‌తో ఈ యంగ్‌స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.

News December 6, 2025

‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

image

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్‌లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.