News March 22, 2026

IPL చరిత్రలోనే తొలిసారి

image

SRH తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్‌ను నియమించడంతో ఈ ఏడాది IPL ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 18 సీజన్లలో తొలిసారి ఆరంభ మ్యాచ్‌లకు అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే నాయకత్వం వహించనున్నారు. రజత్(RCB), శ్రేయస్(PBKS), పరాగ్(RR), హార్దిక్(MI), రుతురాజ్(CSK), అక్షర్(DC), గిల్(GT), రహానే(KKR), పంత్(LSG) టీమ్స్‌ను లీడ్ చేయనున్నారు. 2019 సీజన్ మధ్యలో ఒకట్రెండు మ్యాచ్‌లకు ఇలా జరిగింది.

Similar News

News April 9, 2026

అస్సాం CM ఫిర్యాదు.. TG HCను బెయిల్ కోరిన పవన్ ఖేరా

image

తన భార్యకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, వాటిని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చలేదన్న కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపణలపై CM హిమంత బిశ్వశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని ఖేరా TG హైకోర్టును ఆశ్రయించారు. FIR నమోదైన రాష్ట్రంలోని పోలీసులు అరెస్ట్ చేయకుండా కాపాడేది ఈ బెయిల్. ఆ తర్వాత ఆయన సంబంధిత రాష్ట్రంలోని కోర్టును ఆశ్రయించేందుకు వీలు కలుగుతుంది.

News April 9, 2026

హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్లు అక్కడి మీడియా ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని నౌకలు హార్ముజ్ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. కాగా తాజా పరిస్థితులపై పాక్ ప్రధాని షెహబాజ్‌తో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ USతో డీల్ కుదరాలంటే లెబనాన్‌పై దాడులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.

News April 8, 2026

ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే.. ఇరాన్ కీలక ప్రకటన

image

తమ మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ <<19601083>>దాడులు<<>> కొనసాగిస్తే USతో సీజ్‌ఫైర్ అగ్రిమెంట్‌ను వెనక్కి తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ‘హామీ ఇచ్చి బ్రేక్ చేయడం ఇజ్రాయెల్‌కు అలవాటే. ఆ దేశానికి బుల్లెట్లతోనే సమాధానం చెప్పాలి’ అని ఇరాన్ అధికారి ఒకరు Al Jazeeraతో అన్నారు. మరోవైపు లెబనాన్‌పై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను UN డిమాండ్ చేసింది.