News April 10, 2024

IPL: నేడు GTతో RR ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా GT 4 మ్యాచుల్లో గెలిచింది. RR కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో RR టాప్‌లో ఉండగా, GT 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నేడు ఏ టీమ్ గెలుస్తుందని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News January 26, 2026

గోళ్లు విరిగిపోతున్నాయా?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News January 26, 2026

T20 WCలో పాక్ ఆడుతుందా? సీన్‌లోకి ఆ దేశ ప్రధాని..

image

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందా.. లేదా.. అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. దీనిపై ఈరోజు PCB ఛైర్మన్ నఖ్వీ తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ‘బాయ్‌కాట్’ ఆలోచన ఇంకా తమ పరిశీలనలోనే ఉందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం వచ్చే శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే టీమ్‌ను ప్రకటించగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పాక్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News January 26, 2026

ఇల్లు/షాప్ ముందు ఎలాంటి గుమ్మడికాయ కట్టాలి?

image

దిష్టి తగలకుండా కట్టే గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. దానికి తొడిమ తప్పనిసరిగా ఉండాలి. తొడిమ ఊడిపోయిన దానిని కట్టకూడదు. దీనిని ఇంటికి తెచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బోర్లించకూడదు. తొడిమ పైకి ఉండేలా పట్టుకుని రావాలి. అలాగే గుమ్మడికాయను నీటితో కడగడం నిషిద్ధం. అలా చేస్తే దానికున్న శక్తి తగ్గిపోతుందని అంటారు. కడగకుండానే పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. సూర్యోదయానికి ముందే కట్టాలి.