News April 6, 2025
IPL: హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్

ఈ రోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుండగా రాచకొండ సీపీ సుధీర్ బాబు ట్రాఫిక్ అలర్టు జారీ చేశారు. రామంతపూర్ నుంచి ఉప్పల్ వెళ్లేవారు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 మీదుగా, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ బోడుప్పల్ వెళ్లేవారు వయా నాగోల్ మెట్రో, ఉప్పల్ HMDA భగాయత్ మీదుగా, తార్నాక నుంచి ఉప్పల్ వెళ్లేవారు హబ్సిగూడ క్రాస్ నుంచి నాచారం మీదుగా వెళ్లాలని సూచించారు.
Similar News
News April 13, 2025
కైలాసపట్నంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవిందు(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38),పురం పాప(40),గుంపిన వేణుబాబు(40),సేనాపతి బాబురావు(56), మనోహర్ ఉన్నారు. మరికొద్ది సేపటిలో హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి రానున్నారు.
News April 13, 2025
రేపు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

TG: ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి తొలి కాపీని అందించనుంది. ఈ కమిటీలో మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క సహా పలువురు అధికారులు ఉన్నారు.
News April 13, 2025
NLG: రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షం..!

నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామ శివారులో అర్ధరాత్రి శివలింగం ప్రత్యక్షమైంది. ఆ శివలింగాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఆకతాయిల పనేనని గ్రామస్థులు భావిస్తున్నారు. శివలింగం ప్రత్యక్షమైన స్థలం కొంత వివాదంలో ఉన్నట్లు తెలిసింది.!