News April 27, 2024
ఐపీఎల్ 2.O

ఏం విధ్వంసం.. ఏం బాదుడది. ఈ IPLలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ప్రతి టీమ్ తొలి బాల్ నుంచే సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తోంది. తొలి బ్యాటింగ్ చేసిన టీమ్ కొండంత లక్ష్యాన్ని ఉంచినా ఛేదన జట్టు డీలా పడటం లేదు. బ్యాటర్ల ఊచకోతతో గత 16 సీజన్ల వరకున్న ఎన్నో రికార్డులు ఈ IPLలో తుడిచిపెట్టుకుపోయాయి. బ్యాటర్ల జోరుకు బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఫలితంగా ఐపీఎల్‌పై ఆసక్తి తగ్గుతోందన్న వాదన ఉంది.
Similar News
News January 13, 2026
రైల్వేకు రూ.1.3 లక్షల కోట్లు!.. సేఫ్టీకి ప్రయారిటీ

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్‌ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.
News January 13, 2026
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.


