News March 25, 2024

IPL 2024: నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచుల్లో తలపడగా PBKS 17, RCB 14 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌ను పంజాబ్ విజయంతో ఆరంభించగా, ఆర్సీబీ ఓటమితో మొదలుపెట్టింది. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News December 7, 2025

వాళ్లు నా లైఫ్‌లో ఉన్నందుకు ఆనందిస్తున్నా: ఆమిర్ ఖాన్

image

రీనా దత్తా, కిరణ్ రావుతో డైవర్స్ తీసుకుని భార్యాభర్తలుగా విడిపోయామే తప్పా మనుషులుగా కాదని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. వారంటే ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. ‘రీనాను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా. ఇద్దరం కలిసే లైఫ్‌లో ఎదిగాం. 2వ భార్య కిరణ్‌ అద్భుతమైన వ్యక్తి. ఆమె పేరెంట్స్ మేమంతా కుటుంబం. గర్ల్ ఫ్రెండ్ గౌరి అనుకోకుండా వచ్చిన అదృష్టం. వాళ్లు లైఫ్‌లో ఉన్నందుకు ఆనందిస్తున్నా’ అని చెప్పారు.

News December 7, 2025

పిల్లల్లో ఊబకాయాన్ని ఎలా తగ్గించాలంటే?

image

ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో కూడా ఊబకాయం పెరుగుతోంది. దీనివల్ల వారికి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే..మెరుగైన, పోషకాలతో నిండిన ఆహారాన్ని పిల్లలకు అందించడం చాలా మంచిది. ఆన్​లైన్​లో దొరికే అధిక కేలరీల ఫుడ్స్​ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. పిల్లలకు రోజుకు అరగంటైనా శారీరక శ్రమ ఉండాలి. అలాగే వారు ఒత్తిడికి గురవకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు.

News December 7, 2025

స్కూల్‌పై దాడి.. 43 మంది చిన్నారులు మృతి

image

సుడాన్‌లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్‌లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్‌గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.