News March 16, 2024
IPL-2024: దూరమైన ఆటగాళ్లకు వీరే..

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, పలు జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలు, ఇతర కుటుంబ కారణాలతో కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. షమీ(GT), మార్క్‌వుడ్(LSG), ప్రసిద్ధ్ కృష్ణ(RR), జేసన్ రాయ్, గుస్ అట్కిన్సన్(KKR), హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి(DC), డెవాన్ కాన్వే(CSK) ఈ సీజన్లో ఆడట్లేదు. అలాగే CSK స్టార్ పేసర్ పతిరణ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.
Similar News
News March 30, 2025
ఈరోజైనా ‘300’ కొడతారా?

SRH గత మ్యాచ్‌లో విఫలమైనా అంచనాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. సన్‌రైజర్స్ ఈరోజు వైజాగ్‌లో ఢిల్లీతో తలపడనున్న నేపథ్యంలో 300 లోడింగ్ అంటూ SRH ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. వైజాగ్ స్టేడియం చిన్నది కావడం, బ్యాటింగ్ పిచ్‌తో పాటు పగటిపూట మ్యాచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో భారీ స్కోర్ కొట్టేందుకు రెండు జట్లకూ ఛాన్స్ ఉంది. మరి ‘300’ రికార్డ్ నమోదవుతుందో లేదో చూడాలి.
News March 30, 2025
ప్లీజ్.. Ghibli వాడకం తగ్గించండి: ఓపెన్ ఏఐ సీఈవో

ట్రెండింగ్‌లో ఉన్న <<15920719>>Ghibli వాడకాన్ని<<>> తగ్గించాలని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ యూజర్లకు విజ్ఞప్తి చేశారు. వాడకం ఎక్కువగా ఉందని, యూజర్లు కాస్త కూల్‌గా ఉండాలన్నారు. తమ సిబ్బందికి నిద్ర కూడా అవసరమని దయచేసి వాడకం తగ్గించాలని కోరారు. కాగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి నెటిజన్ల వరకు Ghibli వాడుతున్నారు.
News March 30, 2025
సవతి తల్లి కర్కశత్వం.. పిల్లాడిని గోడకేసి కొట్టడంతో

AP: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మొదటి భార్య కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి చిన్న కొడుకు కార్తీక్(6) మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఆకాశ్‌కు రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో భర్త సాగర్, లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.