News March 19, 2024

IPL-2024: తెలుగు కామెంటేటర్స్ వీళ్లే

image

ఈనెల 22వ తేదీ నుంచి మొదలయ్యే IPL-2024కు సంబంధించిన కామెంటేటర్స్‌ జాబితాను జియో సినిమా విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో సహా 13 భాషల్లో ఉచితంగా మ్యాచ్‌లు చూడొచ్చని తెలిపింది. తెలుగు కామెంటేటర్స్ వీళ్లే.. హనుమ విహారి, వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, ఆశిశ్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, RJ కౌషిక్, సునితా ఆనంద్.

Similar News

News October 22, 2025

సినీ ముచ్చట్లు

image

*ప్రభాస్-హను రాఘవపూడి సినిమా థీమ్‌ను తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల. రేపు 11.07AMకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటన
*నవంబర్ 14న ‘డ్యూడ్’ ఓటీటీ విడుదలకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్!
*త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపిక
*ముంబైలో శిల్పాశెట్టి రెస్టారెంట్.. రోజుకు రూ.2-3 కోట్ల ఆదాయం!

News October 22, 2025

అతిభారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక

image

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎమర్జెన్సీలో ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

News October 22, 2025

బలి చక్రవర్తి ఎవరంటే?

image

బలి చక్రవర్తి రాక్షస వంశంలో జన్మించినప్పటికీ, అపార దాన గుణంతో, పరాక్రమంతో ముల్లోకాలను పరిపాలించాడు. ఈయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్త ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు. ఆయన దాతృత్వాన్ని, అహంకారాన్ని పరీక్షించడానికి విష్ణువు వామనావతారంలో వచ్చాడు. మూడడుగుల నేలను దానంగా అడిగాడు. బలి తన సర్వస్వం దానం చేశాడు. ఈ దాన గుణాన్ని మెచ్చిన హరి పాతాళ లోకానికి బలిని చక్రవర్తిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు.