News May 26, 2024
IPL-2024: నేడే తుది సమరం.. విజయం ఎవరిదో?

ఐపీఎల్-2024 విజేత ఎవరో నేడు తేలిపోనుంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు జరిగే ఫైనల్ మ్యాచ్లో KKR, SRH తలపడనున్నాయి. కోల్కతా ఫైనల్కు చేరడం టోర్నీ చరిత్రలో ఇది నాలుగోసారి. 2012, 2014లో కప్ గెలిచిన ఆ జట్టు 2021లో రన్నరప్గా నిలిచింది. మరోవైపు SRHకి ఇది మూడో ఫైనల్. 2016లో టైటిల్ సాధించిన ఆ జట్టు 2018లో ఓడింది. మరి ఇవాళ జరగనున్న రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారు? కామెంట్ చేయండి.
Similar News
News December 9, 2025
హైదరాబాద్లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.
News December 9, 2025
మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.


