News March 20, 2024
IPL 2024: సూర్య స్థానంలో ఆడేది ఎవరు?

NCA ఫిట్నెస్ టెస్టులో ఫెయిలైన సూర్య కుమార్ యాదవ్కు రేపు మరోసారి టెస్ట్ జరగనుంది. ఒకవేళ అతను ఫిట్నెస్ నిరూపించుకోలేకపోతే IPL సీజన్ మొత్తానికి దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టులో అతడి స్థానంలో ఎవరాడుతారనే దానిపై చర్చ మొదలైంది. నేహాల్ వధేరా, విష్ణు వినోద్లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. గత సీజన్లో రాణించిన వధేరాకే మొగ్గు చూపే ఛాన్సుందని క్రీడావర్గాలు చెబుతున్నాయి.
Similar News
News December 25, 2025
TRAIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 25, 2025
గిగ్ వర్కర్ల సమ్మె: నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

డిసెంబర్ 25, 31 తేదీల్లో స్విగ్గీ, జొమాటో సహా ప్రముఖ సంస్థల డెలివరీ ఏజెంట్లు సమ్మెకు పిలుపునిచ్చారు. పడిపోతున్న ఆదాయం, అధిక పని గంటలు, సెక్యూరిటీ లేని స్పీడీ డెలివరీ లక్ష్యాలకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తున్నారు. వర్క్ ప్లేస్లో సోషల్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో సిటీలతో పాటు టైర్2 పట్టణాల్లో ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సి రావొచ్చు!
News December 25, 2025
క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం: ఒక్క టీకాతో అన్నింటికీ చెక్!

యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దిశగా US శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒకే ఇంజెక్షన్ వేర్వేరు క్యాన్సర్లను అడ్డుకుంది. ఈ నానోపార్టికల్ టీకాతో 88% ఎలుకలు ప్రాణాంతక ట్యూమర్ల నుంచి బయటపడ్డాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. క్యాన్సర్లు మళ్లీ రాకుండా, ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. త్వరలో మనుషులపై పరీక్షలు జరగనున్నాయి.


