News March 29, 2024
ఐపీఎల్ 2024: ఫస్ట్ సెంచరీ కొట్టేదెవరు?

IPL-2024లో ఇప్పటివరకు 9 మ్యాచులు జరగగా ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయలేదు. 170 సిక్సులు, 259 ఫోర్లు, 14 హాఫ్ సెంచరీలు, ఐదుసార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. IPL చరిత్రలో అత్యధిక స్కోర్(277) రికార్డు కూడా నమోదైంది. ప్రస్తుతానికి క్లాసెన్(143) టాప్ స్కోరర్‌గా, ముస్తాఫిజుర్(6) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నారు. మరి ఈ సీజన్లో తొలి సెంచరీ ఏ బ్యాటర్ చేస్తాడని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News October 22, 2025
సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.
News October 22, 2025
వయసుతో నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

* స్నేహితులు దూరమైనా నీతో నీకున్న బంధమే ముఖ్యం
* జనాలు నీ కష్టం కాకుండా ఫలితాలను మాత్రమే చూస్తారు
* వైఫల్యాలు జీవితంలో భాగమే
* ఇల్లు లాంటి మంచి చోటు మరొకటి లేదు
* జీవితంలో ముఖ్యమైనవి కుటుంబం, డబ్బు
* వ్యాయామం మనసుకు శాంతి, శరీరానికి బలం ఇస్తుంది
* పశ్చాత్తాపం, కన్నీళ్లు మీ సమయాన్ని వృథా చేస్తాయి
* అదృష్టం కాదు.. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. Share it
News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.