News February 16, 2025

IPL 2025: హైదరాబాద్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్?

image

హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు ఉప్పల్‌లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది విజేతగా నిలిచిన KKR హోమ్ గ్రౌండ్ ఈడెన్‌ గార్డెన్స్‌లో క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా SRH తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 23న మధ్యాహ్నం ఆడనున్నట్లు సమాచారం. మొత్తం షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.

Similar News

News January 27, 2026

ఎబోలాలో మ్యుటేషన్.. మరింత వేగంగా వ్యాప్తి!

image

ఎబోలా వైరస్ ఇన్ఫెక్షన్ సామర్థ్యాన్ని పెంచే కీలక మ్యుటేషన్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. 2018-2020లో కాంగోలో వచ్చిన అతిపెద్ద ఎబోలా ఔట్‌బ్రేక్‌ను వాళ్లు అధ్యయనం చేశారు. హెల్త్‌కేర్ లోపాల వల్లే కాకుండా జన్యువుల్లో మార్పులతోనూ వైరస్ వేగంగా వ్యాపించిందని ‘సెల్’ జర్నల్‌లో పబ్లిష్‌ అయిన స్టడీ వెల్లడించింది. ఎబోలా నివారణా చర్యలు, డ్రగ్స్ తయారీపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది.

News January 27, 2026

అమల్లోకి ఎన్నికల కోడ్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల <<18974641>>షెడ్యూల్ విడుదలైన<<>> నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC రాణి కుముదిని హెచ్చరించారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2996 వార్డులకు ఎన్నికలకు జరుగుతాయని తెలిపారు. 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు.

News January 27, 2026

ChatGPT, Geminiతోనే ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ ఓపెన్ చేయక్కర్లేదు!

image

ఇకపై మీ ఫుడ్ ఆర్డర్లను లేదా సరకుల డెలివరీలను ట్రాక్ చేయడానికి స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. నేరుగా ChatGPT, Gemini వంటి AI చాట్‌బాట్‌లతోనే పని కానిచ్చేయొచ్చు. ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రొటోకాల్’ సాయంతో స్విగ్గీ ఈ సేవలను ప్రారంభించనుంది. దీంతో చాట్ చేస్తూనే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సరకులు తెప్పించుకోవచ్చు. యూజర్ల తరఫున AI ఏజెంట్లే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేస్తాయి. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు.