News December 16, 2025
IPL-2026 అప్‌డేట్

IPL 2026 ప్రారంభ తేదీ మారింది. తొలి మ్యాచ్ మార్చి 26న జరగనుందని Cricbuzz వెల్లడించింది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా ఇదివరకు మార్చి 15న ఐపీఎల్ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
Similar News
News December 16, 2025
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్‌వర్త్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌లో 500B డాలర్ల మార్క్‌ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ సుమారు $677Bగా ఉంది.
News December 16, 2025
హనుమంతుడి కుమారుడి గురించి మీకు తెలుసా?

పురాణాల ప్రకారం.. హనుమంతుడి చెమట చుక్క ద్వారా ఓ మకరానికి మకరధ్వజుడు జన్మించాడు. ఆయన పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా పనిచేశాడు. అయితే ఓనాడు రామలక్ష్మణులను పాతాళంలో బంధిస్తారు. అప్పుడు హనుమంతుడు వారిని రక్షించడానికి అక్కడికి వెళ్తాడు. పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి, తన కుమారుడైన మకరధ్వజుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు నిజం తెలుసుకొని మకరధ్వజుడు శ్రీరాముడికి సాయం చేస్తాడు.
News December 16, 2025
క్యాబేజీ, కాలీఫ్లవర్‌లో నారుకుళ్లు తెగులు నివారణ

క్యాబేజీ, కాలీఫ్లవర్ నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కనిపిస్తుంది. దీని వల్ల నారు మొక్కల కాండం, మొదళ్లు మెత్తగా తయారై కుళ్లి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన మడులపై లేదా ప్రోట్రేలలో నారును పెంచాలి. విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులను ఇవ్వకూడదు. నారు మొలిచిన తర్వాత లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.


