News October 10, 2025
డిసెంబర్‌లో ఐపీఎల్-2026 వేలం!

ఐపీఎల్-2026 వేలం డిసెంబర్ 13-15 తేదీల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐతో ఫ్రాంచైజీలు చర్చిస్తున్నట్లు Cricbuzz వెల్లడించింది. ప్లేయర్ల రిటెన్షన్‌కు నవంబర్ 15 వరకు డెడ్‌లైన్ ఉండొచ్చని సమాచారం. గత రెండు సీజన్లలో విదేశాల్లో వేలం జరగ్గా, ఈ సారి భారత్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Similar News
News February 20, 2026
రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News February 20, 2026
పురుగు మందులను కొంటున్నారా?

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.


