News April 10, 2025

IPL: ఒకే ఓవర్లో 30 రన్స్

image

IPL: ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించారు. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 24 రన్స్ చేశారు. ఆ ఓవర్లో వరుసగా 6,4,4,4NB,6,1,4(లెగ్ బై) రావడంతో 30 రన్స్ వచ్చాయి. సాల్ట్ 17 బంతుల్లో 37 రన్స్ చేసి రనౌటయ్యారు. విరాట్ (22), పడిక్కల్ (1) కూడా వెనుదిరిగారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 7 ఓవర్లలో 74/3గా ఉంది.

Similar News

News November 23, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు వీరే..!

image

కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్ మొత్తం 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమాకం చేపట్టింది.
1.మహబూబ్‌నగర్‌- సంజీవ్ ముదిరాజ్
2.నాగర్‌కర్నూల్‌- చిక్కుడు వంశీకృష్ణ
3.వనపర్తి- కె.శివసేనారెడ్డి
4.జోగుళాంబ గద్వాల్-రాజీవ్ రెడ్డి
5.నారాయణపేట- కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి.
# SHARE IT

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.