News March 28, 2024

IPL: ఒకే ఓవర్‌లో 4,4,6,4,6,1

image

ఢిల్లీతో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 185/5 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR 36 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ ఆ జట్టును ఆదుకున్నారు. 45 బంతుల్లో 84 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. 20వ ఓవర్‌లో పరాగ్ ఏకంగా 25(4,4,6,4,6,1) రన్స్ రాబట్టారు. అశ్విన్ 29, జురెల్ 20 రన్స్ చేశారు.

Similar News

News April 6, 2026

RBI వడ్డీ రేట్లు మారకపోవచ్చు: ఎకనమిస్టులు

image

వడ్డీ రేట్లలో RBI ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని, యథాతథంగా కొనసాగించవచ్చని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. రూపాయి పడిపోవడం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేట్ల సవరణకు మొగ్గుచూపకపోవచ్చని అంటున్నారు. గత సమీక్షలోనూ రెపో రేటును 5.25 శాతం వద్దే <<19064412>>కొనసాగించడం<<>> తెలిసిందే. RBI MPC 3 రోజుల సమీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. కమిటీ నిర్ణయాలను 8వ తేదీన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.

News April 6, 2026

DSP అవినీతి.. పనిమనిషికే బంగ్లా, థార్ కారు

image

బిహార్‌కు చెందిన DSP గౌతమ్ కుమార్ అవినీతి కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఆయన ఇంట్లో పనిచేసే మహిళకు ₹కోటి బంగ్లా, థార్ కారు ఉన్నట్లు తేలడం ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను విస్మయానికి గురిచేసింది. ఆయన భార్య, గర్ల్‌ఫ్రెండ్ కూడా లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు తాజా విచారణలో తేలింది. సోదాల్లో సుమారు ₹80 కోట్ల విలువైన ప్రాపర్టీలు బయటపడ్డాయి. ఆయన్ను సస్పెండ్ చేసి బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టారు.

News April 6, 2026

GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

image

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్‌సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21