News May 19, 2024
IPL: 7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

గువాహటిలో ఎట్టకేలకు వర్షం తగ్గింది. దీంతో 7 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
RR: జైస్వాల్, కాడ్మోర్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, అశ్విన్, బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, బర్గర్
KKR: గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి
Similar News
News September 17, 2025
గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు లైన్ క్లియర్

AP: విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు అడ్డంకులు తొలగాయి. గొడుగుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దంటూ నిన్న సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ అప్పీల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది.
News September 17, 2025
స్మృతి మంధాన సూపర్ సెంచరీ

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.
News September 17, 2025
పాక్ ‘ఫేక్ ఫుట్‌బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్

ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.