News May 25, 2024
IPL.. అదరగొట్టిన SRH నిర్ణయం

RRతో 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ రూల్‌ను SRH సద్వినియోగం చేసుకుంది. ఇన్నాళ్లూ పెద్దగా ప్రభావం చూపని షాబాజ్ అహ్మద్.. నిన్నటి మ్యాచ్‌లో ఇంపాక్ట్‌గా వచ్చి బ్యాటింగ్‌లో 18 రన్స్ చేశారు. స్పిన్‌కు సహకరించిన చెపాక్‌లో 3 వికెట్లు తీసి పటిష్ఠ స్థితిలో ఉన్న RRను గట్టి దెబ్బకొట్టాడు. జోరు మీదున్న యశస్వీ జైస్వాల్‌తో పాటు రియాన్ పరాగ్, అశ్విన్‌లను పెవిలియన్ పంపి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు.
Similar News
News January 5, 2026
నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.
News January 5, 2026
ఎన్ని నీళ్లు వాడుకున్నా అడ్డు చెప్పలేదు: సీఎం చంద్రబాబు

AP: తెలంగాణతో నీటి వివాదాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఫర్వాలేదు మనకూ నీళ్లు వస్తాయని ఊరుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం. నీటి విషయంలోగానీ సహకారంలోగానీ తెలుగు వారంతా కలిసే ఉండాలి’ అని తెలుగు మహా సభల సందర్భంగా పిలుపునిచ్చారు.
News January 5, 2026
ప్రీ టర్మ్ బర్త్ను నివారించాలంటే?

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.


