News March 29, 2024
ఐపీఎల్: ALL TIME RECORD

ఐపీఎల్‌లో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్లో తొలి రోజు చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌ను ‘స్టార్’లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఏ సీజన్లోనైనా తొలి రోజు మ్యాచ్‌ను ఇంతమంది తిలకించడం ఇదే మొదటి సారి. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 1,276 కోట్ల నిమిషాలు వీక్షించారు. జియో సినిమా డిజిటల్‌లో 11.3 కోట్ల మంది మ్యాచ్‌ను తిలకించారు.
Similar News
News April 10, 2026
ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్‌కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.
News April 10, 2026
HDFC వినియోగదారులకు అలర్ట్!

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.
News April 10, 2026
ముద్దు ముచ్చట తీరకముందే బకెట్ తన్నేస్తారా?

పెళ్లి, పిల్లల ముద్దుముచ్చట్లు, రిటైర్మెంట్ లైఫ్.. ఇవన్నీ అనుభవించాల్సిన జీవితాన్ని నేటి యువత చేజేతులా నాశనం చేసుకుంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్, ఒత్తిడి తగ్గాలని స్మోకింగ్, నిద్ర కోసం మద్యం సేవించడం ప్రాణాంతకం. సంపూర్ణమైన జీవితం గడపాలంటే తక్షణమే జీవనశైలి మార్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.


