News April 9, 2025
IPL: చెన్నైకు మరో ఓటమి

CSKతో మ్యాచులో 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. ఈ సీజన్లో PBKSకు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.
Similar News
News April 17, 2025
ఆ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకు వారు విధులు నిర్వహించవచ్చని తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 25వేల టీచర్ నియామకాలు చెల్లవని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
News April 17, 2025
అమానుషం.. బధిర బాలికపై సామూహిక అత్యాచారం?

UPలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ఓ 11 ఏళ్ల మూగ-చెవిటి బాలిక అర్ధనగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, పంటిగాట్లు, మర్మాంగాలపై సిగరెట్తో కాల్చిన గుర్తులున్నట్లు వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు SP అతుల్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.
News April 17, 2025
YCP హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు: కూటమి నేతలు

AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.