News November 6, 2024
IPL AUCTION: ఏ దేశం నుంచి ఎంతమందంటే?

ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలానికి మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో భారత్ నుంచి 1,165 మంది ప్లేయర్లు ఉన్నారు. సౌతాఫ్రికా-91, ఆస్ట్రేలియా-76, ఇంగ్లండ్-52, న్యూజిలాండ్-39, వెస్టిండీస్-33, అఫ్గానిస్థాన్-29, శ్రీలంక-29, బంగ్లాదేశ్-12, నెదర్లాండ్స్-12, యూఎస్ఏ-10, ఐర్లాండ్-9, జింబాబ్వే-8, కెనడా-4, స్కాట్లాండ్-2, యూఏఈ-1, ఇటలీ-1 నమోదు చేసుకున్నారు.
Similar News
News November 15, 2025
ఆర్జేడీ భంగపాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీనతే!

బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే బిహార్‌లో ఆర్జేడీ ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సమస్యలను పక్కనపెట్టి ఓట్ చోరీ ఆరోపణలపై ఎక్కువగా దృష్టిపెట్టడం కూడా మహాగఠ్‌బంధన్ కొంపముంచిందని చెబుతున్నారు. బలహీన కాంగ్రెస్ ఆర్జేడీకి భారమైందని, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకోవడమూ ఓటమికి కారణమని అంటున్నారు. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.
News November 15, 2025
గ్లోబల్ ఫెరారీ రేసింగ్‌లో తొలి భారతీయ మహిళ

చిన్నప్పుడు అందరు పిల్లలు కార్టూన్లు చూస్తుంటే డయానా పండోలె మాత్రం రేసింగ్ చూసేది. అలా పెరిగిన ఆమె ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైనా పలు రేసుల్లో ఛాంపియన్‌గా నిలుస్తోంది. త్వరలో గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్‌లో పాల్గొని మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News November 15, 2025
PGIMERలో 13 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

చండీగఢ్‌లోని<


