News July 25, 2024

IPL: ఆటగాళ్ల రిటెన్షన్‌పై BCCI కీలక నిర్ణయం?

image

IPLలో ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునేందుకు BCCI అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురు స్వదేశీ, ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 31న జరిగే BCCI-IPL సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. కాగా ఎనిమిది మందిని రిటెన్షన్ చేయాలని ఫ్రాంచైజీలు కోరుతున్నట్లు టాక్. కానీ అంతమందికి రిటెన్షన్ చేస్తే మెగా వేలం చప్పగా సాగుతుందని BCCI భావిస్తోందట.

Similar News

News December 5, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇస్రో-<>విక్రమ్<<>> సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.