News March 31, 2024

IPL: ఢిల్లీ భారీ స్కోరు

image

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. వార్నర్, పంత్ అర్ధసెంచరీలతో రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. CSK బౌలర్లలో పతిరణ 3, జడేజా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. చెన్నై టార్గెట్ 192.

Similar News

News March 16, 2026

G20 దేశాల్లో పెట్రోల్ రేట్ల పెరుగుదల ఇలా: TBJP

image

యుద్ధం కారణంగా పెట్రో మంటతో అగ్రరాజ్యాలు అల్లాడుతున్నా మన దేశంలో ధరల నియంత్రణ పక్కాగా ఉందని TBJP పేర్కొంది. సామాన్యుడిపై భారం పడకుండా దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్న PM మోదీ సమర్థ నాయకత్వానికి ఈ గణాంకాలే నిదర్శనమంటూ G20 దేశాల్లో పెట్రోల్ రేట్ల జాబితాను Xలో పోస్ట్ చేసింది. FEB 1-MAR 12 మధ్య రేట్ల మార్పును ఇందులో పొందుపర్చింది. USలో అత్యధికంగా 22% పెరగగా INDలో మార్పు లేదని వెల్లడించింది.

News March 16, 2026

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం

image

భార్యే ఇంటికి మహాలక్ష్మి. ఆమె చేసే పనులే భర్త ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి కారణమవుతాయి. ఆమె తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుందట. ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఉపవాసాలు ఉంటే వైవాహిక బంధం బలపడుతుందట. సాయంత్రం వేళ ఇంటి ముంగిట, పూజ గదిలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇల్లాలి క్రమశిక్షణ, భక్తి ఆ ఇంట్లో ధన ధాన్యాలకు కొదువ లేకుండా చేస్తాయి.

News March 16, 2026

ప్రీ టర్మ్ బర్త్‌ను నివారించాలంటే?

image

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.