News March 11, 2025
IPL: లక్నోకు బిగ్ షాక్!

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది. 150kmph వేగంతో బంతులు వేయడం మయాంక్ ప్రత్యేకత. కాగా మార్చి 24న లక్నో తన తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
Similar News
News November 25, 2025
రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.
News November 25, 2025
ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
News November 25, 2025
ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>


