News April 9, 2025
IPL: స్టేడియంలో చాహల్ గర్ల్ ఫ్రెండ్ సందడి

సీఎస్కే-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సందడి చేశారు. పంజాబ్ వికెట్లు తీసినప్పుడు ఆమె స్టాండ్స్‌లో ఎగిరి గంతులేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాహల్‌తో కలిసి మహ్వాష్ ఓ మ్యాచ్ కూడా తిలకించారు.
Similar News
News April 17, 2025
YCP హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు: కూటమి నేతలు

AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
News April 17, 2025
బాలీవుడ్లో తెలుగు డైరెక్టర్ హవా.. సీక్వెల్ ప్రకటన!

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్లో తన తొలి సినిమా ‘జాట్’తో ప్రేక్షకులను మెప్పించారు. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ APR 10న విడుదలై ఇప్పటివరకు రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ ‘జాట్-2’ను ప్రకటించింది. ఈ మూవీనీ గోపీచందే తెరకెక్కించనున్నారు. అటు సన్నీడియోల్ దీనితో పాటు బోర్డర్-2, గదర్-3 లోనూ నటిస్తున్నారు.
News April 17, 2025
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్

AP: ఎస్సీ వర్గీకరణ-2025కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఇటీవల ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.