News April 14, 2025
IPL: టాస్ గెలిచిన చెన్నై

ఐపీఎల్లో భాగంగా ఈరోజు లక్నోలో CSKతో LSG తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఈ మ్యాచ్లో CSK కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తెలుగు ప్లేయర్ రషీద్ CSKలో ఈరోజు ఆడనున్నారు.
CSK: రచిన్, రషీద్, త్రిపాఠీ, విజయ్ శంకర్, ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్, కాంబోజ్, ఖలీల్, పతిరణ
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, ఆవేశ్
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


