News April 14, 2024

IPL.. చెన్నై భారీ స్కోర్

image

వాంఖడే స్టేడియంలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్(21), రహానే(5) నిరాశపర్చగా.. గైక్వాడ్, శివమ్ దూబే చెలరేగి ఆడారు. రుతురాజ్ 40 బంతుల్లో (5 ఫోర్లు, 5 సిక్సులు) 69 రన్స్ చేయగా.. దూబే 38 బంతుల్లో 66 రన్స్ చేశారు. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కొయెట్జీ, గోపాల్ తలో వికెట్, హార్దిక్ 2వికెట్లు తీశారు.

Similar News

News March 10, 2026

సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గాలంటే!

image

✦ ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్ల బదులు LED బల్బులు వాడాలి
✦ AC టెంపరేచర్‌ను 24-26°C మధ్య సెట్ చేయాలి. ఒక్క డిగ్రీ పెంచితే సుమారు 6% కరెంటు ఆదా
✦ AC ఆన్‌లో ఉండగా తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే రూమ్ త్వరగా చల్లబడుతుంది
✦ AC ఎయిర్ ఫిల్టర్‌ను 15 రోజులకోసారి శుభ్రం చేయాలి
✦ TV, ల్యాప్‌టాప్ ఛార్జర్, మైక్రోవేవ్ వంటివి స్టాండ్‌బై మోడ్‌లోనూ విద్యుత్ వాడతాయి. వాటిని ఆఫ్ చేయాలి

News March 10, 2026

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు వీరివే

image

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో మహ్మద్ షమీ (22) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జహీర్ ఖాన్ (17), బుమ్రా(16), అశ్విన్ (16), సచిన్ టెండూల్కర్ (15), రవీంద్ర జడేజా (15) ఉన్నారు. టీ20 WC ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నారు.

News March 10, 2026

రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.