News September 29, 2024

IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ కొనసాగింపు

image

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2027 వరకు కొనసాగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. 2027 సీజన్ అయ్యాక ఆ తర్వాత కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్‌ను తొలిసారి 2023 సీజన్‌లో అమలు చేశారు. దీని ప్రకారం మ్యాచ్ మధ్యలో ప్లేయింగ్ 11లో ఉన్న ఓ ప్లేయర్‌ను మరో ఆటగాడితో రీప్లేస్ చేసి ఆడించవచ్చు.

Similar News

News November 15, 2025

ఎగ్ షెల్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటారు. వాటిల్లో ఒకటే ఎగ్‌ షెల్‌ పేరెంటింగ్‌‌. ఇందులో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికీ పంపకుండా తమ వద్దే ఉంచుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లి అందరితో కలిస్తేనే నైపుణ్యాలు వస్తాయి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవుతారు. అన్నిట్లో తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. కాబట్టి ఇలాంటి విధానం పిల్లలకు మంచిది కాదంటున్నారు నిపుణులు.

News November 15, 2025

జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!

image

TG: జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపునకు TDP ఓటు బ్యాంక్ కలిసొచ్చినట్టు తెలుస్తోంది. నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్, మాగంటి గోపీనాథ్ అప్పట్లో కోర్ TDP నేతలు. మాగంటి 2014లో TDP నుంచి గెలిచి BRSలో చేరారు. ఇక CM రేవంత్ సైతం అమీర్‌పేట్‌లో NTR విగ్రహం పెడతానని చెప్పడం, గ్రౌండ్ లెవెల్‌లో ఓ సామాజిక వర్గంతో సమావేశమై మద్దతు కూడగట్టారు. అటు BRS, BJP కూడా ఆశలు పెట్టుకున్నా ఆ పార్టీ ఓటర్లు INCకే జైకొట్టాయి.

News November 15, 2025

ECపై ఆరోపణలను కొట్టిపారేయలేం: స్టాలిన్

image

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీ కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని తెలిపారు.