News May 25, 2024

IPL: ఫైనల్‌కు ముందు SRH కీలక నిర్ణయం

image

IPL ఫైనల్‌కు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు SRH ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది. నిన్నే మ్యాచ్ ఆడటం, చెన్నైలో ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ చేయట్లేదు. మరోవైపు కేకేఆర్ చివరగా మంగళవారం మ్యాచ్ ఆడటంతో ఆ ప్లేయర్లకు సరైన విశ్రాంతి లభించింది.

Similar News

News January 6, 2026

VHT: డబుల్ సెంచరీ చేసిన హైదరాబాద్ ప్లేయర్

image

విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌తో మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు విధ్వంసం సృష్టించారు. 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ సెంచరీ నమోదు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరో ఓపెనర్ గహ్లాట్ రాహుల్(65) ఫిఫ్టీతో రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 352 రన్స్ చేసింది. కాగా ఈ సీజన్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ. అంతకుముందు స్వస్తిక్(216) ద్విశతకం బాదారు.

News January 6, 2026

హిల్ట్ పాలసీ ఉద్దేశమిదే: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: హిల్ట్ <<18765759>>పాలసీ<<>>తో HYD నగర ప్రజలను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికవేత్తల భూములు ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు. హిల్ట్ పాలసీ కింద 6 నెలలు గడువు ఇస్తామని, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామన్నారు. ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ అనేది రాబోయే తరాల కోసం వేస్తున్న ఆరోగ్యకరమైన పునాది అని ఆయన చెప్పారు.

News January 6, 2026

బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.