News April 5, 2025
IPL: పీకల్లోతు కష్టాల్లో CSK

ఢిల్లీతో మ్యాచులో 184రన్స్ టార్గెట్ ఛేదించడానికి చెన్నై కష్టపడుతోంది. రన్స్ రాబట్టేందుకు ఆ జట్టు ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి CSK 5 కీలక వికెట్లు కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది. రచిన్ 3, కాన్వాయ్ 13, గైక్వాడ్ 5, దూబే 18, జడేజా 2 రన్స్‌కు ఔటయ్యారు. క్రీజులో ధోనీ, విజయ్ శంకర్ ఉన్నారు. విజయానికి 54 బంతుల్లో 107 పరుగులు కావాలి. మరి టార్గెట్‌ను CSK ఛేదించగలదా? కామెంట్ చేయండి.
Similar News
News December 21, 2025
ఆయన ఫెయిలై.. మమ్మల్ని నిందిస్తారేంటి: ఖర్గే

అస్సాం విషయంలో PM మోదీ చేసిన <<18631472>>ఆరోపణలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ‘కేంద్రం, అస్సాంలో ఆయన ప్రభుత్వమే ఉంది. ప్రజలను రక్షించడంలో వాళ్లు విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మేం అక్కడ పాలిస్తున్నామా? ఆయన ఫెయిలై.. ప్రతిపక్షంపై తోస్తారు. వాళ్లే విధ్వంసకారులు. మేం కాదు. టెర్రరిస్టులనో, చొరబాటుదారులనో మేం సపోర్ట్ చేయడం లేదు. ప్రజలను కాపాడటంలో విఫలమై మాపై నిందలు వేస్తున్నారు’ అని మండిపడ్డారు.
News December 21, 2025
రేవంత్ పేరు ఎత్తని KCR

తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరును ప్రస్తావించలేదు. దాదాపు గంటా 15 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తయినా కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, అధికార పార్టీ అని మాత్రమే సంబోధిస్తున్నారు. తాజాగా ఇదే కంటిన్యూ చేశారు. అటు కూతురు కవిత పేరు కూడా ప్రస్తావనకు రాలేదు.
News December 21, 2025
షాకింగ్.. బిగ్‌బాస్ విన్నర్ ప్రకటన!

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేత ఎవరనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో విన్నర్ ఎవరో తెలియనుండగా ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ముందే విజేతను చెప్పేసింది. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అని పేర్కొంది. కాగా వికీపీడియాలో ఎవరైనా మార్పులు(ఎడిట్) చేసే అవకాశముంది. దీంతో కొందరు కావాలనే వ్యూయర్స్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బిగ్‌బాస్ టీమ్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవు.


