News March 31, 2025
IPL: సీఎస్కే చెత్త రికార్డు

ఐపీఎల్‌లో సీఎస్కే చెత్త రికార్డులు మూటగట్టుకుంటోంది. 2019 నుంచి ఆ జట్టు 180పైగా టార్గెట్‌ను ఛేదించలేదు. ఇప్పటివరకు 9సార్లు ఛేజింగ్‌కు దిగగా అన్నిట్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. మరే ఇతర జట్టు ఛేజింగ్‌లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోలేదు. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా సీఎస్కే 180పైగా ఛేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగి 15 సార్లు గెలిచింది. ఇందులో సురేశ్ రైనా ఆడిన 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
Similar News
News January 18, 2026
ఇరాన్‌లో లీడర్‌షిప్ మారాలి: ట్రంప్

ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ‘సిక్ మ్యాన్’గా సంబోధించిన ఆయన దేశాన్ని హింసతో కాకుండా గౌరవంతో నడపాలని హితవు పలికారు. దేశాన్ని సరిగ్గా ఎలా నడపాలో తన నుంచి నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నేతల తీరు వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.
News January 18, 2026
OTTలోకి కొత్త సినిమాలు

ధనుష్, కృతిసనన్ జంటగా నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2025 NOV 28న విడుదలై రూ.150కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అటు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మార్క్’ మూవీ ఈనెల 23 నుంచి జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ JAN 1న థియేటర్లలో రిలీజైంది.
News January 18, 2026
పితృ దేవతల అనుగ్రహం కోసం ఇలా చేయండి!

పితృ దోషాలు, పూర్వీకుల అనుగ్రహం పొందేందుకు మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైందని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉంటూ, మౌనవ్రతం పాటించాలి. జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు నల్ల నువ్వులతో తర్పణం వదలాలి. పేదలకు అన్నదానం, వస్త్ర దానం, పెరుగు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. పండితుడికి బూడిద గుమ్మడికాయ దానం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.


