News May 13, 2024
IPL: టాస్ ఆలస్యం

కోల్‌కతా, గుజరాత్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్‌లో ఆకాశం మేఘావృతమైంది. వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.
Similar News
News March 10, 2026
రేపు జగన్ ప్రెస్‌మీట్

AP: వైసీపీ చీఫ్ జగన్ రేపు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. వివిధ అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 10, 2026
చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.


