News April 23, 2025
IPL: లక్నోపై ఢిల్లీ ఘన విజయం

LSGతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఛేజింగ్‌లో రాహుల్(57*), పోరెల్(51) అర్ధ శతకాలతో రాణించారు. ఓ మోస్తరు లక్ష్యం కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. మార్క్రమ్ 2 వికెట్లు తీశారు. ఇవాళ విజయం సాధించినా రన్‌రేట్ పరంగా PTలో DC 2వ స్థానంలో కొనసాగుతోంది. GT అగ్రస్థానంలో ఉంది.
Similar News
News April 23, 2025
దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.
News April 23, 2025
డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.