News April 24, 2024
IPL.. బౌండరీ లైన్ల పరిధి పెంచాలని డిమాండ్

IPL-2024లో 250+ స్కోర్లు నమోదవుతున్నాయి. దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్.. ‘ప్రతి గ్రౌండ్లో బౌండరీ లైన్ల పరిధి పెంచాలి. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్‌కు, క్యాచ్‌కు తేడా లేదు. 2-3 మీటర్ల వరకు బౌండరీ పరిధి పెంచాలి. లేదంటే బౌలర్లు ఇబ్బంది పడతారు. క్రికెట్లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య భీకరపోరు జరిగితేనే మ్యాచ్ ఆసక్తిగా ఉంటుంది. ప్రతిసారీ బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగినా బోర్ కొడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News December 23, 2025
₹8 కోట్ల ఆన్లైన్ మోసం.. తుపాకీతో కాల్చుకుని మాజీ IPS ఆత్మహత్య

సైబర్ మోసానికి మాజీ IPS బలయ్యారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు పంజాబ్‌కు చెందిన అమర్ చాహల్(Ex IG)ను నమ్మించారు. ఆయనతో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయించారు. ఈ క్రమంలో ఆయన రూ.8 కోట్లు మోసపోయారు. తీవ్ర ఆవేదనతో పటియాలాలోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని సూసైడ్ నోట్లో కోరారు.
News December 23, 2025
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, LT, టైటన్ లాభాల్లో.. ఇన్ఫీ, TCS, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News December 23, 2025
పాపాలు చేసి స్వర్గానికి ఎలా వెళ్లాడు?

అజామిళుడు అనే బ్రాహ్మణుడు మోహం వల్ల ధర్మాన్ని వీడి పాపకార్యాలు చేస్తాడు. ఓసారి ఆయన మరణశయ్యపై ఉండగా తనను తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు. వాళ్లను చూసి, భయంతో తన చిన్న పుత్రుడిని ‘నారాయణ’ అని పిలిచాడు. పాపపుణ్యాల గురించి తెలియని యమధూతలు ‘నారాయణ’ అనే విష్ణునామం వినగానే అతడిని యమపాశం నుంచి రక్షించారు. అజామిళుడు కేవలం భగవంతుడి నామాన్ని ఉచ్ఛరించడం వల్ల నరకానికి వెళ్లలేదు. దైవనామస్మరణకు ఉన్న శక్తి ఇది!


