News March 18, 2025

IPL: ఓపెనింగ్ సెర్మనీకి దిశా పటానీ, శ్రద్ధా కపూర్

image

మరో 5 రోజుల్లో ఐపీఎల్ మహాసంగ్రామానికి తెర లేవనుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్లు దిశా పటానీ, శ్రద్ధా దాస్, సింగర్స్ కరణ్ ఆజ్లా, శ్రేయా ఘోషల్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు టాక్.

Similar News

News November 14, 2025

KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

image

<>KVS,<<>> NVS 14,967 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో అసిస్టెంట్ కమిషనర్ 17, ప్రిన్సిపల్(227), వైస్ ప్రిన్సిపల్ 58, PGT 2,996, TGT 6,215, PRT 3365, లైబ్రరీ సైన్స్ 147, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 12, ఫైనాన్స్ ఆఫీసర్ 5, Asst ఇంజినీర్ 2, ASO 74, Jr ట్రాన్స్‌లేటర్ 8, Sr సెక్రటేరియట్ అసిస్టెంట్ 832, Jr సెక్రటేరియట్ అసిస్టెంట్ 760, స్టెనోగ్రాఫర్ 60, ల్యాబ్ అటెండెంట్ 165, MTS 24పోస్టులు ఉన్నాయి.

News November 14, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

⋆ నోయిడాలో నేటి నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నీ. 51 కేజీల విభాగంలో పోటీ పడనున్న నిఖత్ జరీన్.. బరిలోకి మరో 19 మంది భారత బాక్సర్లు
⋆ చెస్ WC నుంచి ప్రజ్ఞానంద ఔట్.. ప్రీ క్వార్టర్స్‌కు అర్జున్, హరికృష్ణ
⋆ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్: వ్యక్తిగత, టీమ్ కాంపౌండ్ ఈవెంట్స్‌లో ‘గోల్డ్’ సాధించిన జ్యోతి సురేఖ
⋆ నేటి నుంచి ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నీ.. UAEతో IND-A ఢీ

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.