News April 21, 2025

IPL.. CSKకు ఇంకా అవకాశం ఉందా?

image

IPLలో మేటి జట్లను చిత్తు చేసిన CSK ఈసారి వరుస పరాజయాలు చవిచూస్తోంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఇప్పటికీ CSK ప్లేఆఫ్స్‌‌కి వెళ్లొచ్చు. ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 నెగ్గి 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు.. మిగతా 6 మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించాలి. నెట్ రన్‌రేట్ కూడా పెంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి CSK ప్లేఆఫ్స్‌కు వెళ్తుందని మీరు భావిస్తున్నారా?

Similar News

News August 6, 2025

ఖాతాదారులకు HDFC బ్యాంక్ హెచ్చరికలు

image

APK ఫైల్ స్కామ్‌పై HDFC బ్యాంక్ తమ ఖాతాదారులను హెచ్చరించింది. ‘స్కామర్లు మీకు బ్యాంకు సిబ్బందిలా APK ఫైల్స్ పంపుతారు. అవి డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాలవుతుంది. మీ కాల్స్, డేటా వారికి చేరుతుంది. రీ-కేవైసీ, పెండింగ్ చలాన్లు, ట్యాక్స్ రిటర్న్స్ అని వచ్చే లింక్స్ క్లిక్ చేయకండి. థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి. మోసపూరిత లింక్స్, మెసేజులు వస్తే రిపోర్ట్ చేయండి’ అని సూచించింది.

News August 6, 2025

సీజ్‌ఫైర్ ఉల్లంఘన రిపోర్ట్స్‌పై స్పందించిన ఆర్మీ

image

J&Kలోని పూంఛ్ సెక్టార్‌లో పాక్ సీజ్‌ఫైర్ ఉల్లంఘించిందంటూ పలు రిపోర్టులు, దాదాపు అన్ని మీడియా ఛానల్స్‌లో వచ్చిన వార్తలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. LoC వెంట ఎలాంటి సీజ్‌ఫైర్ ఉల్లంఘన జరగలేదని, పాక్ కాల్పులకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చింది. కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పాక్ సీజ్‌ఫైర్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఆర్మీ వర్గాలు చెప్పినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి.

News August 5, 2025

నట వారసత్వంపై Jr.NTR రియాక్షన్

image

తన పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలనేది పూర్తిగా వారి ఇష్టమేనని స్టార్ హీరో Jr.NTR అన్నారు. “నా తర్వాత మా ఫ్యామిలీలో ఎవరు నట వారసత్వం కొనసాగిస్తారో నాకు తెలీదు. నేనేదీ ప్లాన్ చేయలేదు. ‘నువ్వు యాక్టర్ కావాలి’ అని చెప్పే రకమైన తండ్రిని కాదు. నేను అడ్డంకి కాకుండా వారధి కావాలి అనుకుంటాను. వారే స్వయంగా ఈ ప్రపంచం, సంస్కృతులను తెలుసుకోవాలి. పండగలు వస్తే పిల్లలతోనే టైమ్ స్పెండ్ చేస్తా’ అని వ్యాఖ్యానించారు.