News April 8, 2025
IPL: ఓడిపోయినా మనసులు గెలుచుకున్నాడు

లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో కేకేఆర్ పోరాడి ఓడింది. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. చివరి ఓవర్లో 24 రన్స్ చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్ మొదట్లోనే స్టైక్ వస్తే రింకూ కచ్చితంగా గెలిపించేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 17, 2025
భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
News April 17, 2025
WEF జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF గుర్తిస్తుంది.
News April 17, 2025
వేసవి సెలవులొస్తే ఇలా ఉండేది!

వారం రోజుల్లో వేసవి సెలవులొస్తున్నాయ్. ఇప్పుడంటే సెలవు రోజుల్లో టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. ఎండను చూసి భయపడుతున్నారు. కానీ, 90S కిడ్స్ అలా ఉండేవాళ్లు కాదు. మండుటెండలోనూ రస్నా తాగేసి సూర్యుడికి ఎదురుగా నిలబడేవాళ్లు. పాత టైర్‌తో ఊరంతా చుట్టేయడం, గోలీల ఆట, తొక్కుడు బిళ్ల, దాగుడు మూత, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా, కర్రబిళ్ల వంటి ఆటలు ఆడుతూ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్లు. మీరూ ఇలానే చేసేవారా?