News May 26, 2024
మరికాసేపట్లో IPL ఫైనల్.. వాతావరణం ఎలా ఉందంటే?
కాసేపట్లో కేకేఆర్, SRH మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చెన్నై చెపాక్ స్టేడియంలో వర్షం కురిసే అవకాశం తక్కువేనని అక్యూవెదర్ తెలిపింది. కాగా నిన్న ఇదే సమయానికి స్టేడియంలో వర్షం కురిసింది. ఒకవేళ ఇవాళ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా స్టేడియానికి తరలివస్తున్నారు.
Similar News
News January 18, 2025
రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి
ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్(23) మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్ను ట్రక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అమన్ ‘ధర్తీపుత్ర్ నందిని’ అనే సీరియల్లో లీడ్ రోల్లో నటించారు.
News January 18, 2025
నిరాశపరిచిన సింధు
ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
News January 18, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 18, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.28 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు
✒ ఇష: రాత్రి 7.20 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.