News October 4, 2024

IPL: వీరిని ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదల్లేదు

image

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఐదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదులుకోలేదు. వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ-సీఎస్కే, విరాట్ కోహ్లీ-ఆర్సీబీ, సచిన్ టెండూల్కర్-ముంబై ఇండియన్స్, సునీల్ నరైన్-కేకేఆర్, రిషభ్ పంత్-డీసీ ఉన్నారు. వీరిలో ధోనీ మినహా అందరూ ఒకే జట్టుకు ఆడారు. IPL-2025 సీజన్‌కు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకే ఆడతారని అంచనా. వీరి రిటెన్షన్లపై ఆయా ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

Similar News

News March 28, 2026

అనిరుధ్‌తో కావ్యా మారన్ పెళ్లి?

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వారు డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. వారిద్దరూ కలిసి కనిపించడం, SRHకు సాంగ్ కంపోజ్ చేయడం దీనికి బలాన్ని చేకూర్చాయి. అనిరుధ్ గతంలో ఆ వార్తలను ఖండించినప్పటికీ వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందంటూ తాజాగా తమిళ మీడియా పేర్కొంటోంది.

News March 28, 2026

మలబద్ధకమా? ఈ టిప్స్ మీ కోసమే

image

వైద్యపరంగా వారానికి మూడు కంటే తక్కువసార్లు విసర్జన అవుతుంటే దాన్ని మలబద్ధకంగా భావిస్తారు. ఎక్కువ రోజులు ఈ సమస్య ఉంటే పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, అవిసె గింజలు, సబ్జా, యోగర్ట్ వంటి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు 8-10 గ్లాసుల నీరు తాగాలి. రోజూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
Share It

News March 28, 2026

టార్గెట్ 300.. ఏ టీమ్ కొడుతుందో?

image

కొన్నేళ్లుగా IPL టీమ్‌లను ఊరిస్తున్న స్కోర్ 300. ఈసారి ఆ స్కోర్ గ్యారంటీ అంటూ SRH కెప్టెన్ ఇషాన్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లే జట్టులో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లున్నారు. IPLలో టాప్ 5 హయ్యెస్ట్ స్కోర్ల(287/3, 286/6, 278/3, 277/3, 272/7)లో తొలి 4 SRHవే. మిగతా జట్లలోనూ భీకర బ్యాటర్లున్నారు. మరి ఈ సీజన్‌లో 300ను ఏ జట్టు కొట్టగలదో కామెంట్ చేయండి.