News February 13, 2025

IPL.. RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

image

RCB ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఆ జట్టు కెప్టెన్ ఎవరో రేపు తేలిపోనుంది. గురువారం ఉ.11.30 గంటలకు ఆ జట్టు తమ కెప్టెన్ పేరును ప్రకటించనుంది. గత సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డూప్లిసెస్‌ను జట్టు రిలీజ్ చేయడంతో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి కోహ్లీనే కెప్టెన్‌గా ప్రకటిస్తారని అందరిలోనూ అంచనాలున్నాయి. విరాట్ కాకుంటే కృనాల్ పాండ్య, భువనేశ్వర్, జితేశ్ శర్మ‌లు రేసులో ఉన్నారు.

Similar News

News November 23, 2025

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

తిరుపతి SP ఆఫీసులో సోమవారం జరగాల్సిన PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పంచమి తీర్థం (చక్రస్నానం) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని SP కోరారు.

News November 23, 2025

డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీకోసం’: జగన్

image

AP: రైతులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని చెప్పి ఎండమావులు చూపిస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతుల ఒంటి మీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారని ఫైరయ్యారు. రైతుల కష్టాలు, బాధలపై చర్చ జరగకుండా చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని విమర్శించారు. 18 నెలల్లో రైతుల కోసం ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అని జగన్ Xలో ప్రశ్నించారు.

News November 23, 2025

అతి పురాతన నక్షత్రాలను నాసా గుర్తించిందా?

image

బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో ఏర్పడిన పురాతన నక్షత్రాలను NASAకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించినట్టు తెలుస్తోంది. భూమికి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో LAP1-B గెలాక్సీలో ఉన్న Population III లేదా POP III అని పిలిచే ఈ స్టార్స్ హైడ్రోజన్, హీలియం తక్కువ ఉండే ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయి. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 రెట్లు తీవ్రమైన అల్ట్రావయొలెట్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు.