News March 26, 2024
IPL: నేడు చెన్నైతో గుజరాత్ ఢీ

ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్‌లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Similar News
News November 2, 2025
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News November 2, 2025
వీళ్లు తీర్థయాత్రలు వెళ్లాల్సిన పని లేదు

కార్తీక వ్రత మహత్యం చాలా గొప్పదని పండితులు చెబుతున్నారు. ‘భూమ్మీదున్న పుణ్యక్షేత్రాలన్నీ కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంద్రాదులు కూడా ఈ వ్రతస్థులను సేవిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన చోటు నుంచి గ్రహ, భూత పిశాచ గణాలు పారిపోతాయి. నిష్ఠగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం ఆ బ్రహ్మకే సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువక ఆచరించేవారు తీర్థయాత్రల అవసరమే లేదు’ అని అంటున్నారు. <<-se>>#Karthikam<<>>
News November 2, 2025
పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు.. నివారణ

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.


