News April 2, 2025
IPL: గుజరాత్ టార్గెట్ 170 రన్స్

GTతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 169-8 స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) రాణించారు. కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పాటీదార్ (12) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. GT బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీయగా, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.
Similar News
News February 5, 2026
సత్తుపల్లి: ఉత్తీర్ణతే లక్ష్యంగా.. ‘విద్యాదీక్ష’

విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సత్తుపల్లి JVR ప్రభుత్వ కళాశాల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బుధవారం కళాశాల ప్రిన్సిపల్ గోపి ‘విద్యాదీక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ దీక్షలో భాగంగా విద్యార్థులు 41 రోజులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కేవలం చదువుపైనే ఏకాగ్రత వహించాలని సూచించారు.

లొద్ద జలపాతం ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

సాలూరు మండలం లొద్ద జలపాతం ప్రారంభం ఏర్పాట్లను పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. కాగా ఇప్పటికే జలపాతం వద్ద ఆర్చితో పాటు రహదారి, పర్యాటకులు సేద తీరడానికి విశ్రాంత బల్లలు, డ్రస్ చేంజింగ్ రూమ్స్, దుకాణాలను సిద్ధం చేశారు. సౌకర్యాలు సమకూర్చడంలో ఎటువంటి లోపాలు ఉండరాదని అధికారులకు సూచించారు.