News April 19, 2025
IPL: టాస్ గెలిచిన గుజరాత్

అహ్మదాబాద్‌లో మొదలుకానున్న GTvsDC మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
DC: పోరెల్, కరుణ్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, ముకేశ్, మోహిత్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్, తెవాటియా, రషీద్, అర్షద్, సిరాజ్, కిశోర్, ప్రసిద్ధ్, ఇషాంత్
Similar News
News April 20, 2025
SSMB29: రెండు నెలలపాటు భారీ యాక్షన్ సీక్వెన్స్?

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB29 మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు డైరెక్టర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో పెద్ద సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. 2 నెలల పాటు షూట్ జరుగుతుందని, మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక పాల్గొంటారని సమాచారం.
News April 20, 2025
మగవాళ్లకూ ‘హీ’ టీమ్స్ ఉండాలి: పురుషులు

మహిళలకు ‘షిీ’ టీమ్స్‌లాగే పురుషులకు కూడా ‘హీ’ టీమ్స్ ఉండాలని భార్యాబాధితులు డిమాండ్ చేశారు. భార్యల చిత్రహింసల నుంచి తమను కాపాడాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల భార్యాబాధితులు ఢిల్లీలోని ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువమంది బాధితులు పాల్గొన్నారు. వీరంతా ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన చేపట్టారు. తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా ఇందులో పాల్గొనడం విశేషం.
News April 20, 2025
మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్: రేపే హాల్ టికెట్లు

TG: మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి ఈనెల 27న నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 27న ఉ.10 నుంచి మ.12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, అదే రోజు మ.2 నుంచి సా.4 గంటల వరకు 7-10 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష జరగనుంది.